శేరిలింగంపల్లిలో కార్మిక దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లిలో నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జిహెచ్ఎంసి వర్కర్స్ శ్రమను గుర్తిస్తూ వారికి చిరు సత్కారం కార్యక్రమం మదీనాగూడలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము శేర్లింగంపల్లి కో-ఆర్డినేటర్ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మరియు అషా, జనసైనికుడు నరేష్ ఉపేందర్, సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ కార్మికుల దినోత్సవ ప్రత్యేకతను గుర్తు చేసుకున్నారు. ఈ మేడే ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది. ఎంతో మంది శ్రామికులు పోరాటాలు చేసి, రక్తాలను చిందించి కార్మిక హక్కులు సాధించారు. ప్రపంచంలో ఏ మూలనైనా తమ రెక్కల కష్టంతో పనిచేసే వారందరూ కార్మికులే. ప్రతి కార్మికుడి సంక్షేమం ముఖ్యమే. వారికంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకోకుండా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాల్సిందే అని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్మికుడికి మేడే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్కర్స్ శ్రమను గుర్తించి వారికి సన్మానం చేయడం జరిగింది అనంతరం వారికి స్వీట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జిహెచ్ఎంసి కార్మికుల కుటుంబాలకు విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రభుత్వం అందించాలని కోరారు. అదేవిధంగా వారికి డబల్ బెడ్ రూమ్ కూడా కేటాయించాలని కోరారు. వీరు అనునిత్యం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ప్రభుత్వం కూడా వీరికి కావాల్సిన కనీస అవసరాలు, హ్యాండ్ గ్లౌజ్ , హెల్మెట్స్ శానిటైజర్స్ మరియు తగిన సామాగ్రిని వారికి ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు లక్ష్మీనారాయణ, నరసింహారెడ్డి శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, సాయి, ప్రశాంత్, నాగరాజు, ప్రసాద్, శశి, పవన్, దిలీప్, బాలాజీ, శివ నారాయణ, రత్న రాజు, సత్య ప్రకాష్, కిషోర్, ప్రభు, నాని, సాయి, కిరణ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.