కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు: కనపర్తి మనోజ్ కుమార్

కార్మికుల పోరాట విజయాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ” మే” డే జరుపుకుంటారు. అట్టడుగున ఉన్న లక్షలాది మంది కార్మికులు తమ విముక్తిని పొందిన రోజే ఈ “మే” డే, మనిషి శ్రమ యొక్క దోపిడి పై తిరుగుబాటు తనమే ఈ “మే” డే, కార్మిక వర్గానికి స్ఫూర్తినిచ్చే రోజే ఈ “మే ” డే, ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పించే రోజే ఈ “మే” డే, శ్రమను దోపిడి చేసే పెట్టుబడిదారీ విధానం అంతరించడం కోసం పోరాడిన రోజే ఈ” మే” డే, కార్మికుల శ్రమ దోపిడీ కోసం తమ యొక్క ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాటం చేసిన అమరవీరుల అందరికీ నివాళులర్పిస్తూ.. పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.