ఎస్.కోట, గురువారం తిమిడిలో జరుగుతున్న ఉపాధిహామీ మట్టిరోడ్ పనులు పరిశీలన కొరకు వెళ్లిన జనసేన నేత వబిన సన్యాసి నాయుడుకి కూలీలు 6వారాల పేమెంట్స్ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని మాకు ఇన్ని వారాలు పేమెంట్స్ పడకపోతే కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందన్నారు. వెంటనే ఏ.పీ.ఓ. రమ్యని సంప్రదించిన సన్యాసి నాయుడు పేమెంట్స్ వేయించమని విజ్ఞప్తి చేశారు. సి.ఆర్.డి.ఏ నుండి క్రెడిట్ అవలేదని 10వ తేదీలోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ నిచ్చారు.
Share this content:
Post Comment