మెగాస్టార్ ఆచార్య నుండి లాహే లాహే లిరికల్ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి లాహే లాహే పాటను మేకర్స్ విడుదల చేశారు. చిరు మునుపటిలా చాలా ఎనర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొడతారని రషెస్ చూస్తే తెలిసిపోతుంది. లాహే లాహే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయడం ఖాయమనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హారిక నారాయణ్‌, సాహితి చాగంటి పాడారు. ఫోక్ మెలోడీగా సాగే ఈ పాటకు మణిశర్మ మ్యూజిక్ ప్రాణం చేసిందనే చెప్పాలి.

సీనియర్ నటి సంగీత, కాజల్ పాటలో కాజల్, సంగీత సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాంచరణ్ , నిరంజన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.