ప్రపంచ ప్రఖ్యాతిగాంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు పొందిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పి కుంట మండలం గూటిబైలు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిమ్మమాంబ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల గ్రామ పెద్దల సహకారంతో శ్రీ శ్రీ తిమ్మమాంబ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ పూజారి, గ్రామ సర్పంచి విష్ణుమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించి అమ్మవారి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామపెద్దలు తిమ్మమాంబ, బాలవీరయ్యల చరిత్రను తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కోసం వచ్చే భక్తులకు తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటుగా జనసేన పార్టీ ఐటివింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్రప్రసాద్, కత్తి అరవింద్, కుమ్మర సోమశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
Share this content:
Post Comment