రాంబాబుకు అండగా లక్ష్మన్న

*10,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన లక్ష్మన్న

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాంబాబు లివర్ సంబంధిత సమస్యలతో కళ్యాణి హాస్పిటల్‌లో శస్త్రచికిత్సకు గురయ్యారు. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బి లక్ష్మన్న రాంబాబును ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెబుతూ, రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం రాంబాబు భార్యతో మాట్లాడి కుటుంబ సభ్యులకు సహాయంగా నిలిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు జగ్గాపురం చిన్న ఈరన్న కూడా రాంబాబును పరామర్శించి సానుభూతి తెలిపారు. జనసేన – బీజేపీ నేతల సానుభూతి మరియు మద్దతు రాంబాబు కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది.

Share this content:

Post Comment