‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్

సౌత్ లో మంచి విజయం సాధించిన ‘కాంచన’ సినిమా బాలీవుడ్ లో ‘లక్ష్మి బాంబ్’ పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘లక్ష్మి బాంబ్’ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా ఇటీవలే పూర్తయ్యింది. లక్ష్మి బాంబ్ లో అక్షయ్ కుమార్ లేడీ గెటప్ కు సంబంధించిన ఫోటోను ఆ మధ్య రిలీజ్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆమధ్య ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే కథలో ఎలాంటి మార్పు లేదని అర్ధమవుతుంది. ఇక తన నటనతో కామెడీ తో అక్షయ్ అదరగొట్టబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అక్షయ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది . ఇక ఈ సినిమాను నవంబర్ 9న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.