జనసేనాని ముఖ్యమంత్రి కావాలని బాబా ఆశీస్సులు తీసుకున్న లక్ష్మీ కుమారి

*గురు పౌర్ణమి ప్రత్యకపూజలు

తుమ్మలపాలెం: జులై 13 వ తేదీ గురు పౌర్ణమి పురస్కరించుకొని తుమ్మలపాలెం గ్రామంలో సోమవారం ప్రత్యకపూజలు నిర్వహించారు. సనాతన హైందవ సంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామంలో వేంచేసియున్న సాయిబాబా వారికి సేవల నిమిత్తం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దంపతులు చింతల గణేణ్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతులు 30,000 వేల రూపాయిల విలువగల టేకు పల్లకిని బాబా వారికి సమర్పించారు. గుడి కమిటీ వారు మరియు చింతల లక్ష్మీ గణేష్ దంపతుల చేతుల మీదుగా పల్లకి సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామస్తులంతా పండుగ వాతావరణంలో బాబా సేవలో తరించారు. సాయినాధుని ఆశీస్సులతో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని,పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ కుమారి బాబా వారి ఆశీస్సులు తీసుకున్నారు.