లక్ష్మీ మంచు కుమార్తె విద్యా అరుదైన ఘనత

మంచు లక్ష్మీ ప్రసన్న కుమార్తె  విద్యా నిర్వాణ అరుదైన ఘనతను సాధించింది. ఆరేండ్ల వయసులో “యంగెస్ట్ చెస్ ట్రైనర్‌”గా నొబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నది. శనివారం నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో విధ్యా నిర్వాణ అర్హత సాధించి ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నది. విద్యా నిర్వాణ ఈ ఘనతను సాధించినందుకు మోహన్ బాబు .. లక్ష్మి మంచు సహా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు తల్లిదండ్రులు తమ పిల్లలను వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. మంచు వారసురాలు సాధించిన ఘనతకు అభిమానులు సోషల్ మీడియాల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే “యంగెస్ట్ చెస్ ట్రైనర్”గా నొబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తల్లిగా ఎంతో గర్వంగా ఉంది”అన్నారు మంచులక్ష్మీ.