జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కుంటిమద్ది

అనంతపురం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనొక నియంతని నేను చెప్పిన విధంగా మీరందరూ నడుచుకోవాలి, లేదని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే మీడియా మిత్రులపై ప్రభుత్వ అధికారులను ఉసిగొలిపి తప్పుడు కేసులు పెట్టిస్తాను, వినకపోతే వైసిపి నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదులుగా తయారుచేసి దాడులు చేయిస్తాను అని అధికార మదమెక్కి ప్రవర్తిస్తున్న తీరుని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి “జర్నలిజం” అన్నా, “జర్నలిస్ట్” అన్నా నీకేం తెలుసు? ఒక మీడియా సంస్థకు యజమాని అయి ఉండి కూడా జర్నలిస్టు హక్కులను కాలరాస్తూ వారి పైన దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నావు, ఈ పాపం ఊరికే పోదు భవిష్యత్తులో తలిగిన మూల్యం చెల్లించుకో తప్పదు అని నీకు తెలియజేస్తున్నాం. జర్నలిజాన్ని తమ వృత్తిగా చేసుకొని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని తమ యజమాన్యాలు చాలిచాలని జీతాలని ఇచ్చిన, అర్ధాకలతో కడుపు మాడ్చుకొని ఎండనకా! వాననకా!! గాలనకా!!! అలుపెరగకుండా వాస్తవాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చేరువేయాలని దృడ సంకల్పంతో నీతి నిజాయితీతో ఎందరో మహానుభావులు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన జర్నలిస్ట్ మహానుభావులు ఉన్న దేశం ఇది. నీలాంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయినారు నీవెంత? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని జనరల్ లిస్టు సోదరులకు, జర్నలిస్టు సమాజానికి బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ పత్రిక జర్నలిస్టుపై దాడి జరిగింది మాకెందుకులే! మా పత్రిక జర్నలిస్టు పైన కాదు కదా! అని జర్నలిస్టు సోదరులు ఎవరు భావించకండి, ఈరోజు వారికి జరిగింది రేపు మీకు జరగదని గ్యారెంటీ ఏమిటి? జర్నలిస్టు సోదరులు అందరూ సంఘటితంగా ఏకం తాటిపై కొచ్చి జర్నలిస్టు సమాజాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సేవ్ మీడియా,

సేవ్ జర్నలిజం,

సేవ్ జర్నలిస్ట్,

సేవ్ డెమోక్రసీ,

జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో “ఛలో అనంతపురం” అనే కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొని జర్నలిస్టు సోదరులకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది.