భూ సేకరణ తక్షణమే నిలుపుదల చేయాలి: బొంతు డిమాండ్

రాజోలు నియోజవర్గం: ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు సంస్థకు తీర ప్రాంతాల గ్రామాల సొసైటీ భూముల నుండి భూ సేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. మలికిపురం మండలం, కేశనపల్లి బాధిత సొసైటీ సభ్యుల అభ్యర్థన మేరకు జనసేన పార్టీ, మానవ హక్కుల వేదిక, రాజోలు నియోజకవర్గం పరిరక్షణ సమితి, బహుజన సమాజ్ పార్టీ నాయకులు భూ సేకరణ చేస్తున్న భూములను గురువారం బాధిత కుటుంబాలతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూములు గత మూడు నాలుగు తరాల నుండి ఎస్సీ కుటుంబాలు అనుభవిస్తున్నాయని, ఆ భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కోవడం తమ జీవనోపాధి కోల్పోతామని ప్రజా సంఘాల నాయకులు ఎదుట బాధితులు కన్నీటి పర్యంతమై చెప్పారు. ఏవిఆర్ సంస్థకు సేకరిస్తున్న భూమి గల సొసైటీ సభ్యులకు అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా భూసేకరణ చేయడం చట్ట విరుద్ధమని జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు అన్నారు. చట్టాలకు విరుద్ధంగా అధికారులు భూసేకరణ చేస్తే జనసేన పార్టీ తరఫున ఉద్యమాలు చేసి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాల పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఏవిఆర్ సంస్థకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి, ఇప్పటివరకు ఇటువంటి అనుమతులు లేవని, అలాగే రాష్ట్రస్థాయిలో కాన్సెంట్ టు ఎస్టాబ్లిష్, భూగర్భ జలాల శ్వేత అనుమతులు పొందారా? అని మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు అధికారులను ప్రశ్నించారు. ఈ భూములను ఏవిఆర్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారాన్ని ప్రజలు ముందు ఉంచాలన్నారు. కేశనపల్లి, పడమటిపాలెం సి సి ఎఫ్ సొసైటీ నుండి 18 ఎకరాలు భూమిని సేకరించాలని, ఆ భూమిలో 92 మంది సభ్యులు ఉన్నారని తక్షణమే అధికారులు భూ సేకరణ నిలుపుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావుతో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిముత్యాల శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గం పరిరక్షణ చైతన్య సమితి నాయకులు గెడ్డం బాలరాజు, విప్పర్తి సాయిబాబా, నల్లి ప్రసాద్, మంద సత్యనారాయణ, బహుజన సమాజ్ పార్టీ నాయకులుమొక్క శీను బాబు, యెడ్ల శ్రీనివాస్, మంద ధనరాజ్, యెడ్ల చిట్టిబాబు, సుమలత, విష్ణుమూర్తి, గడ్డం శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.