జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రాలు ఇచ్చిన భూమిలేని కౌలు రైతులు

ఆత్మకూరు, గత 30 ఏళ్లుగా సొంత భూమి లేక, వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, ఉపాధి హామీ పనులకి వెళ్తూ జీవనం సాగిస్తున్న కౌలు రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భరత్ మాట్లాడుతూ భూమి లేని రైతులకి ప్రభుత్వము భూములు మంజూరు చేయాలని, వ్యవసాయం చేస్తూ సొంత భూమి లేక రైతులు కౌలు కట్టుకోలేక, ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతున్నారని, అర్హత కలిగిన వారికి భూమి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కానగల శ్రీనివాస్ జయప్రసాద్, నరసింహ రాయల్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.