నాదెండ్ల మనోహర్ సమక్షంలో శింగనమల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసేనలో చేరికలు

శింగనమల, జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ అధ్యక్షతన, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం నుంచి ముక్కోటి అంబికా సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లా శివయ్య దాదాపు 200 మందితోను మరియు బేడా, బుడగ, జంగాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కుల్లయమ్మ 30 కుటుంబాలతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి నాదెండ్ల మనోహర్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పద్మావతి అనంతపురం నగర అధ్యక్షులు బాబు రావు జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.