వినోదం పంచేందుకు లాస్య-రవి జోడి ఈజ్ బ్యాక్..

బుల్లితెరపై జంటగా రవి లాస్య, లాస్య రవి ఒకప్పుడు సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. బుల్లితెరపై ఇప్పుడు రష్మీ సుధీర్ ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో.. ఒకప్పుడు రవి లాస్యలు అలా హాట్ టాపిక్ అయ్యారు. మ్యూజిక్ షో ద్వారా ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చి ఫుల్ పాపులార్టీ సంపాదించుకున్నఈ జోడీ కొన్ని కారణాల వలన విడిపోయారు. లాస్య పెళ్లి చేసుకొని ఫ్యామిలీకే పరిమితం కాగా, రవి ఇంట్రెస్టింగ్ షోస్‌కు యాంకరింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ జంటని సంక్రాంతి పండుగ మళ్లీ కలిపింది.

సంక్రాంతి స్పెషల్ కార్యక్రమానికి రవి, హోస్ట్‌లు చేయనుండగా, దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. ఇందులో రవి.. లాస్యకు సారీ చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీతో ఫన్ చేశాడు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఇద్దరు తాము కలిసిపోయామని చెబుతూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్న ఫొటోలు షేర్ చేశారు. టామ్ అండ్ జెర్రీ మళ్ళీ వచ్చేశాం అంటూ రవి కామెంట్ చేశాడు. ఏదేమైన మళ్ళీ ఒక్కటైన రవి-లాస్య జంట ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.