హారతి ఇచ్చి స్వాగతించిన లతారజనీకాంత్

తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్  హై బీపీ సమస్యలతో డిసెంబర్ 25న జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. 48 గంటల పాటు ఆయనని అబ్జర్వేషన్‌లో ఉంచి పలు పరీక్షలు నిర్వహించగా, అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గా రావడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అయితే రక్తపోటు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండనుండటంతో పాటు వారం రోజుల పాటు విశ్రాంతి  తీసుకోమని వైద్యులు సూచించారు.

డిశ్చార్జ్ తర్వాత రజనీకాంత్ అపోలో ఆస్పత్రి నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకొన్నారు. ఇంటికి చేరుకున్న రజనీకాంత్ కు శ్రీమతి లతా రజనీకాంత్ హారతితో ఇంట్లోకి స్వాగతించారు.