ఓటీటీ లో ”వకీల్ సాబ్”.. అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘వకీల్​సాబ్’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ‘వకీల్​సాబ్’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. హిందీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ గురించి అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్​రాజు స్పష్టం చేశారు. కానీ థియేటర్లు మూతపడటం వల్ల కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది మూవీ యూనిట్. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించగా.. ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటించారు.