వకీల్ సాబ్ యుఎస్ఏ రైట్స్ దక్కించుకున్న వీకెండ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫొటోస్ తో సినిమాపై హైప్స్ పెంచేసింది చిత్రయూనిట్ .

తాజాగా ఈ చిత్రం యుఎస్ఏ రైట్స్ ని సథరన్ స్టార్ అసోసియేషన్ భాగస్వామ్యంతో వీకెండ్ సినిమా సంస్థ దక్కించుకుంది. ఏప్రిల్ 8 న ప్రీమియర్ షోలు మొదలవనున్నాయి, ఈ మేరకు సోషల్ మీడియా లో సదరు సంస్థ పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.