కుప్పగల్లు స్టోరేజ్ ట్యాంక్ నుండి మూడు- మూడు గ్రామాలకు ఒక పైపులైన్ వెయ్యండి.. జనసేన

ఆదోని: కుప్పగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి మూడు- మూడు గ్రామాలకు ఒక మంచినీటి పైపులైన్ వెయ్యండి అంటూ శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించి, ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల నాయకులు యం.తాహేర్ వలి నాయకులు రేణువర్మ, పులిరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, జాలిమంచి, గణేకల్లు, ఇస్వి ఈ గ్రామాలకు సురక్షిత మంచినీరు అరకోరా సరఫరా జరుగుతున్నాయి. పైన తెలిపిన ఆరు గ్రామాలకు ఒకే మోటార్ ఒకే పైపులైన్ నుంచి సరాసర చేయడంతో తరచూ మోటార్ రిపేర్ రావడం, పైపులు పగిలిపోవడం జరుగుతుంది. జనాభా పెరగడం మరోపక్క గ్రామాల విస్తీర్ణం పెరగడంతో త్రాగునీటి అంతరాయం కలుగుతుంది. గ్రామాలలో బోరు బావిలు ఉన్నప్పటికీ ఆ నీరు త్రాగటానికి ఉపయోగపడటం లేదు. అందుకనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి సరాఫర అయ్యే నీటిపైనే ఈ ఆరు గ్రామాలు ఆధారపడి ఉంటాయి. 2005లో ట్యాంక్ మంజూరు అయింది. 2008 ఆఖరి నాటికి కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు ఈ మూడు గ్రామాలకే 2017 వరకు సరఫరా అయ్యాయి. ఆ తర్వాత ప్రజా పోరాటం ఫలితంగా ప్రభుత్వం స్పందించి జాలిమంచి, గణేకల్లు, ఇస్వి గ్రామాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం కుప్పగల్లు గ్రామంలో ఒక అండర్ గ్రౌండ్ మంచినీటి సంప్ ను నిర్మించి ఇక్కడి నుంచి జాలిమంచి, గణేకల్లు, ఇస్వి గ్రామాలకు మంచినీరు సరాసరా చేసి ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. 2019 సంవత్సరంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండిపడి ఇప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మత్తులు పనులు చేయటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి ట్యాంక్ లో పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఈ గ్రామాలతో పాటు ఆదోని మండలంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని గ్రామాలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా శుద్ధి చేసిన మంచినీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదోని మండలంలోని గ్రామాలలో చివరి వీధులలో మంచినీటి పైప్ లైన్లు లేక త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి గ్రామంలో అన్ని వీధులకు మంచినీటి పైప్లైన్లు వేసి ప్రజలకు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రాబోయే కాలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సహికరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు దసప్ప, నాగరాజు, విరేష్, శాంత, నరసన్న, హనుమంత రెడ్డి, జయరాజ్, భీమన్న, లోకేష్, బాబు, మహేంద్ర, సిద్దు, కళ్యాణ్, అశోక్, రమేష్, రవి వర్మ, రామ్ రెడ్డి, ఈరన్న, రాజు, పాల్గొన్నారు.