వ్యవసాయ శాఖ మంత్రిపై మండిపడ్డ బొబ్బేపల్లి జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు బుధవారం వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉద్యోగంలో చేరిన కాకాని గోవర్ధన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బుధవారం ఉదయం మా అధినేత పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా మేము దీటుగా ఒకటే చెబుతున్నాం ముందు మిమ్మల్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎవరైనా సమస్య ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకు వస్తే వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా, ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని మాట్లాడుతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండి, 14 కేసులు ఉండి అవినీతి పరుడై ఉండి, మరి ఆయన కుటుంబంలో వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఎవరెవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. అనేటువంటి విషయాన్ని తిరగేస్తే గోవర్ధన్ రెడ్డి మీకు అర్థమవుతుంది. ఊరికే నోరు ఉంది కదా అని మా అధినేతను గురించి మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. అదేవిధంగా మా అధినేత ప్యాకేజీ తీసుకున్నాడని మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ ప్యాకేజీ విషయంలో మీరు ఏమన్నా మీడియేషన్ చేశారా అని అడుగుతున్నా, ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం తీర్మానం చేసేటప్పుడు మీరు అసెంబ్లీలో ఉండి మీరేం చేస్తున్నారు. మీకు ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలి, ఒక రాజధాని అయితే మాకు దోచుకునే దానికి సరిపోదు అనేటువంటి విషయం మీకు ఆరోజు తెలియదా ఏం చేస్తున్నారు మీరు అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ శాఖలలో ఉన్నటువంటి అందరూ పవర్ లేని మంత్రులై ఉత్తుత్తి మంత్రలై ఉండరు. మరి మీ శాఖలకి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు ఇక్కడ దాఖలాలు అదేవిధంగా అన్ని కార్పొరేషన్ నిధులను కేటాయికి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మరి ఆ నిధులు ఎటుబోయినటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా పరిస్థితి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే అవినీతిపరుడై ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో బాబాయ్ హత్య చేయబడితే ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరు అనేటువంటి విషయాన్ని వెల్లడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సిబిఐ దత్తపుత్రుడి గురించి ఈయన మాట్లాడుతాడు. మరి 2019 ఎన్నికలలో మీ రాయల్ ప్యాలెస్ మద్యం పంచుకొని ఎన్నికలలో గెలిచి కొన్ని కుటుంబాల్ని బలి చేసినటువంటి మీరు మా అధినేతను గురించి మాట్లాడి స్థాయి మీది కాదు అని చెబుతున్నాం. ఈరోజు దయచేసి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే అధినేత జగన్ రెడ్డి గారికి మీరు భజన చేసుకోండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మీ ఇష్టానుసారం మాట్లాడితే మేము మాత్రం చూస్తూ ఊరుకోము. అదే విధంగా 3,000 మంది కౌలు రైతులు చనిపోతే మరి మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యుండి మీరేం చేస్తున్నారు? ఎందుకని ఆ కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆ కౌలు రైతుల కుటుంబాలను ఎందుకని ఆదుకోలేదు? అంటే మీ శాఖ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి, మీ చేతిలో పవర్ లేదు కాబట్టి, మీరు తూతూ మంత్రి కాబట్టి మీరు ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి పరిస్థితి. దయచేసి రాబోయే ఎన్నికల్లో మీరు డిపాజిట్లు కూడా మీకు రాకపోవచ్చు దాని పైన దృష్టి పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, రామిరెడ్డి, చెంచయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.