పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన మార్కాపురం జనసేన నాయకులు

మార్కాపురం, ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ అదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి కోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా వారి స్మృతికి ఇవే మా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ సక్రటరీ నూనె సురేష్ బాబు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, గురునాధం, బీసా హరీష్, పిల్లి శ్రీనివాసులు, తన్నీరు ప్రసాద్ పాల్గొన్నారు.