సన్యాసేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి నాయకులు

మహా శివరాత్రి సందర్భంగా ధర్మవరం సన్యాసేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంఎల్ఏ కోళ్ల లలిత కుమారి, జనసెన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, టీడీపీ నాయకులు జి.ఏస్ నాయుడు, తిరుపతిరావు, కిట్టు, నాని, దేవస్థానం డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్వామిని దర్శించుకున్నారు. వారిచే సన్యాసేశ్వర స్వామికి దేవస్థానం ఇ.ఓ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు భక్తుల సౌకర్యార్థం ఎం.ఎస్.వి ఫౌండేషన్ అద్యక్షులు మళ్లువలస ప్రదీప్ ఆధ్వర్యములో జరిగిన మెడికల్ కాంపుని జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వర పుష్పగిరి కాంతి ఆసుపత్రి, మెడకవర్ ఆసుపత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పలువురు భక్తులు ఉచితంగా ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకునీ, మందులు స్వీకరించారు. డాక్టర్ వై.శ్రవణ్ (అంకాలజీ) ఎం.ఎస్.ఎల్ రాజు (ఆర్థోపెడిక్) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పీ.నాయుడు పలువురు మెడికల్ సిబ్బంది 100 మంది పేషంట్స్ పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-26-at-8.32.49-PM-1-1024x471 సన్యాసేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి నాయకులు

Share this content:

Post Comment