పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో అతిథులుగా అలరించిన జనసేన నాయకులు

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం నందు గల రామా టాకీస్ సెంటర్ పరిసర ప్రాంతంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన స్థానిక బిసి యువత మరియు ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అయిన శ్ర తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సూచనలతో అమ్మవారి దివ్య సుముఖమునకు విచ్చేసి10,000 రూపాయలు నగదును విరాళంగా ప్రకటించిన జనసేన పార్టీ నాయకులు ఆస్ట్రేలియ సిటిజన్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఖె. శశికుమార్ యాదవ్ ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, ఆలయ కమిటీ వారు, మరియు బీ సి యువత వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని కొనియాడి, కృతజ్ఞతలు తెలియజేశారు.