రోడ్ల దుస్థితి ప్రభుత్వానికి తెలిజేసెలా.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్

ఎన్ హెచ్16 మైన్ రహదారికి అనుకొని ఉన్న గ్రామం రణస్థలం మండలం, జే.అర్ పురం వెంకటేశ్వర కొలనీ. తద్వారా లోపల నుంచి కింద కాలనీ, నగరప్పలెం,బందిపలెం, కొత్తురు, ఉప్పివలస, రోడ్ చివరకు వచ్చేసరికి ఏడమవైపు పోతే రావాడ మరికొన్ని గ్రామాలు కుడి వైపు పోతే పాతర్లపల్లి మరికొన్ని గ్రామాలు చేరుకోగలము. అలాంటి ముఖ్య రహదారి రోజుకి చాలా వేళల్లో జనం తిరిగే రోడ్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పట్టించుకోవటం లేదు.అడుగులో గుంట — గజనికో గొయ్యి లా ఉన్న ఈ రోడ్ కోసం ఎమ్మెల్యే లు సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లిన న్యాయం జరగని పరిస్థితి, దీనికి న్యాయం తక్షణమే జగరాలని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, జే.అర్ పురం వెంకటేశ్వర కాలనీ వాసులు, జనసేన నాయకులు కార్యకర్తలు, ఇతరులు డిమాండ్ చేసారు. రోడ్ల పరిస్తితి ఇలానే ఉన్న యెడల జనసేన బలంగా దీనికై పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది.