ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం: ఏపీ శివయ్య

చిత్తూరు: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కలయికలో పోటీ చేయనున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏవైనా బేధాభిప్రాయాలు ఉంటే విస్మరించాలని కోరారు. ప్రజలకు పొత్తుల ఆవశ్యకత గురించి క్షుణ్ణంగా వివరించి ఈ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయాలని కోరారు. ఇరు పార్టీ నాయకులు ఆయా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కలిసి పోరాడుదాం ఈ రాష్ట్ర ప్రభుత్వ మార్పులలో భాగస్వాములు కావాలని ఏపీ శివయ్య కోరారు.