జనసేన పార్టీ 11 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని అవమానాలు చీత్కారాలు భరించి ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో నభూతో నా భవిష్యత్ అనే విధంగా విజయాన్ని సాధించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం అని తెలిపారు. చరిత్రలో పవన్ కళ్యాణ్ లాంటి అరుదైన నాయకుడిని రాజకీయంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంటుందని, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరింత ఉత్సాహంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, మార్చ్ 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment