జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉత్సవంలా జరుపుకుందాం: నాదెండ్ల మనోహర్

  • జనసేన సభను విజయవంతం చేయాలి: సామినేని ఉదయభాను

విజయవాడ, బందర్ రోడ్డు, అమరావతి కన్వెన్షన్ నందు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 14 వ తేదీన పిఠాపురం నియోజకవర్గం నందు నిర్వహించదలచిన ఆవిర్భావ దినోత్సవం వేడుక విజయవంతం చేయాలని కోరుకుంటూ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఏ.పి.ఐ.ఐ.సి డైరెక్టర్ అధ్యక్షతన ప్రారంభించారు, ముఖ్యఅతిధులుగా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత పన్నెండేళ్ళగా జనసేన కార్యకర్తలు, వీరహిళలు పార్టీకి ఎంతో అండగా ఉన్నారని. గత ప్రభుత్వంలో ఎంత వేధించిన చెక్కుచెదరని ధైర్యంతో ఎదుర్కొన్నారని. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంకు నమ్మకంతో పనిచేశారని, జనసైనికులు అందరూ కలిసి ఈ పండగ ఉత్సవంలాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో జనసైనికులు అందరూ పార్టీ ఆవిర్భావ సభకి,హాజరు కావాలన్నారు. 2003వ సంవత్సరం నుండి సామినేని ఉదయభానుతో తనకున్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రేపటినుండి కాకినాడ పిఠాపురం ప్రాంతాల్లోనే తాను పర్యటిస్తానని జనసైనికులకు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లడుతూ మార్చి 14 వతేది జరగబోవు 12 వ ఆవిర్భావ సభ కు ఎన్టీఆర్ జిల్లా నుండి వేలాదిగా తరలివెళ్ళబోతున్నామని స్పష్టం చేశారు.ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సత్తా ఈ ఎన్నికల్లో చూసామని అన్నారు. 100%స్ట్రైక్ రేట్ కలిగిన జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు.కనివిని ఎరుగని రితిలో జనసేన ఆవిర్భావ సభ జరగనుందనీ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భాగ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని తెలిపారు.ఇప్పటికే జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి ఒక్క కార్యకర్త కదలిరావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కృష్ణ పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెవు విజయలక్ష్మి, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కె.ఎస్.ఎన్ మూర్తి, ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, నగర పార్టీ ఉపాధ్యక్షులు కామళ్ళ సోమనాథం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ కృష్ణ, తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త బడిశ మురళీకృష్ణ, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరుపిల్ల రాజేష్, అత్తులూరి పెదబాబు, నగర కమిటీ సభ్యులతో పాటు పలు డివిజన్ల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు, సోషల్ మీడియా సైనికులు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment