వజ్రోత్సవాలను శోభాయమానంగా జరుపుకుందాం: పవన్ కళ్యాణ్

74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వలన  లభించింది అని ఆయన గుర్తు చేశారు. దానికి గుర్తుగానే మన త్రివర్ణ పతాకం రెపరెపలాడిoదని ఈ సందర్భంగా తెలిపారు.  కరోనా వైరస్ వల్ల ఈ సంవత్సరం సాధారణంగా జరుపుకున్నా, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక అంటే వజ్రోత్సవాలు శోభాయమానంగా జరుపుకుందామని ఒక లేఖను విడుదల చేశారు.