మార్పు కోరుకుందాం… జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి శ్రీమతి “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో “జనంకోసం జనసేన” “మహా పాదయాత్ర”లో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు, చాలా చోట్ల వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తామని, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపుతామని వాళ్లే స్వయంగా చెప్పడం విశేషం. చాప కింద నీరులా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీకి రోజురోజుకీ ప్రజాదరణ ఈ విధంగా పెరగడం శుభసూచకం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, జనసేన ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే పనులతో కూడిన కరపత్రాలు పంచుతూ… గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు, ఉత్సాహంగా సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారిశెట్టి త్రిమూర్తులు, కర్రి దొరబాబు, ముక్కా రాంబాబు, గల్లా నాగు, ముప్పిడి వరప్రసాద్, గుడాల రాజేష్, వెంకన్న బాబు, కే నాని, బండి స్వామి, వెలిచేటి శ్రీహరి, అనపర్తి దుర్గాప్రసాద్, నందికం మణికంఠ స్వామి, అడప రాజేష్, మొలపర్తి నాగరాజు, లావేటి పండు, ఇల్లపు శివ తదితరులు పాల్గొన్నారు.