అబద్దాల జగనన్నను సాగనంపుదాం

  • పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన అవినీతి అక్రమాలు హత్యలు చేసేసి వాటిని వేరే వారి ఖాతాలోకి నెట్టేసిన అబద్ధాల జగనన్నను సాగనంపుదామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులో శుక్రవారం నిర్వహించిన జనసేన పల్లెపోరు కూటమి నాయకులందరూ కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లెపోరు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ నియోజవర్గంలో ఒక అవినీతి తిమింగలం నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, నేను మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఏదైనా అవినీతి చేసినట్టు నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకునేందుకు సిద్ధమని అన్నారు. దీనిపై చర్చించే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పెంటపాడు పల్లెపోరులో ప్రజల నుంచి ఎక్కువ విన్నపాలు వస్తున్నాయి పెంటపాడు లో పేదలకు ఇళ్ల స్థలాలు పెంటపాడులో ఇవ్వాలి కానీ జగన్నాధపురంలో ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే పెంటపాడు లో డ్రైనేజీ వ్యవస్థని మారుస్తాననీ మంచినీటి కొరత లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద అనకొండ జగన్ అయితే తాడేపల్లిగూడెంలో ఒక తిమింగలం ఉందనీ ఏ పని చేసిన రాష్ట్రాన్ని దోచేస్తున్న వీళ్లు ఓటు అడిగే హక్కు లేదనీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజల్లోకి ఓటు అడగడానికి ఎలా వెళ్తారు అని ప్రశ్నించారు. అటు జగన్ని ఇటు కొట్టు సత్యనారాయణ సాగనంపాలని జనసేన పార్టీ తెలుగుదేశం బిజెపి కలయక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుందని రాబోయే ఎన్నికల్లో ఓటమి విజయం తధ్యమని ఈ దోపిడీ దొంగల్ని ఇంటికి పంపించే టైం ప్రజలు నిర్ణయించుకున్నారనీ నా స్నేహితుడైన బొలిశెట్టి శ్రీనివాస్ నీ ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు నాయకులు భారీగా హాజరయ్యారు.