అవినీతి ప్రభుత్వాన్ని తరిమేద్దాం- ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: అవినీతి ప్రభుత్వాన్ని తరిమేద్దాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం నినాదంతో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ నగర్ లో ఆదివారం పర్యటించారు.
ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన పని చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వారి మాటల్లో నిజం లేదన్నారు. జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం నిలిపేది లేదనీ.. పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం ఆగిపోదనీ.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా తమ ప్రణాళికలు ఉంటాయన్నారు. వైసీపీ నాయకులు కుటిల రాజకీయాలను మానుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. అభివృద్ధి పనులు చేసి అభిమానాన్ని సంపాదించాలి కాని బెదిరింపులతో కాదని అన్నారు. విజయనగరంలో సుందరీకరణ పేరుతో అడ్డగోలు సంపాదనకు స్థానిక ప్రజాప్రతినిధి వినూత్న ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సొమ్మును విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ నగర్ కి వచ్చే రోడ్డు, కాలనీ రోడ్లు అధ్వానంగా వున్నాయని.. వర్షాలు పడితే వాహనాలు తిరగలేని పరిస్థితి వుందన్నారు. అలాగే త్రాగునీరు, వీధి దీపాల సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. కనీసం వాటర్ ట్యాంక్ కూడా నిర్మించలేని దుస్థితిలో పాలకులు వున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి నాయకులు తోట రమేష్, సియ్యాదుల ఝాన్సీ, భరత్, సియ్యాదుల శేఖర్, వార్డు జనసేన నాయకులు పిడుగు సతీష్, పి. రాజ్య లక్ష్మీ, ఆర్. కవిత, కె.పుష్ప, విక్కీ, రాజేష్, పాపరావు, షేక్ బాబాజీ, మురళీ, రాజా, సాయి, నియోజకవర్గ జనసైనికులు డి.రామచంద్రరాజు, కాటం అశ్విని, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి,గట్లాన పుష్ప, అడబాల వేంకటేష్ , దుప్పాడ నరేష్, ఏంటి రాజేష్, చక్రవర్తి, ఎమ్. పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, గొల్లపల్లి మహేష్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, వేంకటేష్, వెంకట రమణ, మధు, భవానీ తదితరులు పాల్గొన్నారు.