జనసేన ఆవిర్భావ సభను విజయ వంతం చేద్దాం: నల్లా శ్రీధర్

జనసేన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనవంతంగా నిర్వహించాలని అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సభ్యులు నల్లా శ్రీధర్ మాట్లాడుతూ, “హలో అమలాపురం – చలో పిఠాపురం” నినాదంతో పార్టీ శ్రేణులంతా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఈరోజు ఉప్పలగుప్తం మండలం గ్రామాల వారీగా పర్యటించి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను ఆహ్వానించారు. ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోయే ఈ సభ విజయవంతం కావాలన్న లక్ష్యంతో, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ అబ్సార్వర్‌గా నియమితులైన నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఇన్‌చార్జి దుగ్గిశెట్టి సుజయ్ బాబు పర్యవేక్షణలో ఉప్పలగుప్తం మండలంలోని 17 పంచాయతీల్లో పార్టీ శ్రేణులను కలుసుకుని, సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సభ్యులు నల్లా శ్రీధర్‌తో పాటు కల్వకొలను తాతాజీ, యాళ్ళ సతీష్, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆకుల బుజ్జి, చిక్కం సుదాసూర్యమోహన్, సాకా రాంబాబు, వాకపల్లి ఈశ్వరీ సత్యనారాయణ, సుంకర అబ్బాయి, దంగేటి బాబులు, కుంపట్ల రమేష్, అయితాబత్తుల కృష్ణారావు, పెమ్మడి శ్రీను, గెడ్డం చినబాబు, వజ్రపు రాంబాబు, పొతుల కన్న, గొలకోటి తాతాజీ, గుత్తాల బోస్, సలాది నాగరాజు, మంచెం బాలకృష్ణ, మోటూరి రవి, బండారు వెంకన్న బాబు, గుండుమోగుల శ్రీను, జిన్నూరి వాసు, బేసి గోపాలకృష్ణ, నిమ్మకాయల సాయి, నూకల రాజా, అరిగెల సూరిబాబు, మద్ధింశెట్టి ప్రసాద్, కంఠంశెట్టి చిన్ని, గనిశెట్టి వీరు, సత్తి చిన్నా, నల్లా సత్తిబాబు, బెండా సతీష్, ఆకుల శ్రీను, నల్లా చిన్ని, నాగులపల్లి సతీష్, వరసాల వెంకటరమణ, చిక్కం వరప్రసాద్, మేకల నానాజీ, నల్లా శ్రీను, సుందరనీడి ఏసు, పైబోడి పండు మరియు వివిధ గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-11-at-4.27.02-PM-1-1024x576 జనసేన ఆవిర్భావ సభను విజయ వంతం చేద్దాం: నల్లా శ్రీధర్

Share this content:

Post Comment