జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం: పిసిని చంద్రమోహన్

పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పి. గన్నవరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పి. గన్నవరం నియోజకవర్గానికి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో కార్యాచరణ సమన్వయకర్తలుగా నియమితులైన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, కరాటం సాయి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బండారు శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. మార్చి 14న చిత్రాడలో నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సభను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు నాలుగు మండలాల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం “హలో పి. గన్నవరం – చలో పిఠాపురం చిత్రాడ” పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. మార్చి 10, 11 తేదీల్లో పి. గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో క్షేత్రస్థాయి పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు, పోలవరం నియోజకవర్గ నాయకులు రవికుమార్, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు మెట్ట వైకుంఠరావు, గుమ్మడి శాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment