జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం!

ఉరవకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ గౌతమ్ కుమార్ పార్టీ కార్యకర్తలను ఏకీకృతం చేసి, అందరితో కలిసి ఈ వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంను విజయవంతం చేయాలని కోరుతూ, ఆదివారం ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌతమ్ కుమార్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బెలుగుప్ప మండల అధ్యక్షుడు సుధీర్, నాయకులు రమేష్, మణి కుమార్, సాయి, ధనుంజయ, నీలకంఠ, బోగేష్, వంశీ, రఘు, సోము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేక పత్రికలను ఆవిష్కరించారు.

Share this content:

Post Comment