జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం: పివిఎస్ఎన్ రాజు

పిఠాపురం, ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చోడవరం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు కోరారు. బుధవారం సాయంత్రం కొత్తకోట పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సభ కావటంతో జనసైనికులు, వీర మహిళలు రెట్టించిన ఉత్సాహంతో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. నాలుగు మండలములలో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిఠాపురం సభను జయప్రదం చేసేందుకు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పిఠాపురం తరలివెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు, బలిజ మహారాజ, గూనూరు మూలు నాయుడు, డి.ఎస్ నాయుడు, కర్రి రమేష్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment