- ఉమ్మడి కర్నూలు జిల్లా కో-ఆర్డినేటర్ & జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త చింతా సురేష్ బాబు, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ పిలుపు
పత్తికొండ, ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పత్తికొండ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త సి.రాజశేఖర్ ఆధ్వర్యంలో 06/03/2025 పత్తికొండ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించిన చింతా సురేష్ బాబు. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలిసభ కావటంతో జనసైనికులు, వీర మహిళలు రెట్టించిన ఉత్సాహంతో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పత్తికొండ నియోజకవర్గంలోని 5 మండలముల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పిఠాపురం ఆవిర్భావ సభను జయప్రదం చేసేందుకు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పత్తికొండ నుంచి తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి/బోయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, జనసేన పార్టీ జిల్లా నాయకులు పి.బి.వి సుబ్బయ్య, రాయలసీమ జోన్- 2 కార్యక్రమాల కార్యనిర్వహణ కమిటీ సభ్యులు బోయ గోవింద్, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యక్రమాల కార్యనిర్వహణ కమిటీ సభ్యులు క్రాంతి కుమార్, బాబ్జి, నాయకులు రామచంద్ర, ఇస్మాయిల్, వడ్డే వీరేష్, సోమపల్లి అశోక్, నాగార్జున, సుధాకర్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment