- పోస్టర్ ను ఆవిష్కరించి జనసేన శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి, ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి నియోజవర్గ సన్నాహక సమావేశంలో ఛలో పిఠాపురం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్చార్జులు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. పదకొండు ఏళ్ళ జనసేన ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని ఇటీవలి సాధారణ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు నెలకొల్పడంలో మా పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమే కారణమని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి జనశ్రేణులకు పవన్ కళ్యాణ్ దశా నిర్థేశించనున్నట్లు ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, కార్పోరేటర్లు సికే రేవతి, నారాయణ, నరసింహాచ్చారి,ఎస్ కే బాబు, పొన్నాల చంద్ర, నరేంద్ర, దూది శివ, ఆదం సుధాకర్ రెడ్డి, యాదవకృష్ణ, వెంకటేశ్వర రావు, హరిశంకర్, బాబ్జి, హేమ కుమార్, సుమన్ బాబు, పగడాల మురళీ, మునస్వామి, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆకుల వనజ, లక్ష్మీ, జీవన్, మోహన్, త్రిలోక్, జిమ్ మురళీ, హేమంత్, ఆది, ప్రభాకర్, జానకిరామ్, శ్రావణ్, బాలాజీ, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment