జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేద్దామని డా.వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మార్చి 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడలో జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవానికి జనసేన పార్టీకి చెందిన ప్రతి జనసేన శ్రేణులు వేడుకల్లో పాల్గొనాలని, జనచైతన్యమే జనసేన ఆశయమనీ, దగాపడ్డ పేదల పక్షాన నిలిచి, వారి సమస్యలపై సాగించిన పోరుకు ఫలితంగానే జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుందని పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ అందరికీ పండుగ రోజని, ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి జనసైనికుడు, వీర మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని, జనసేన ప్రయాణం ఒక ప్రేరణ అని అభివర్ణించారు. ప్రత్యర్ధుల విమర్శలను, ఇబ్బందులను సైతం లెక్క చేయక నిలబడి, కలబడి 100%స్ట్రైక్ రేటుతో విజయబావుట ఎగురవేసిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు. అరకు నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టి చిరంజీవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుగుణంగా కదిలే లక్షలాదిమంది జనసైన్యం జనసేన పార్టీ సొంతమని ఆయన వెల్లడించారు. పిఠాపురంలో జరిగే జనసేనపార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసి మరోసారి జనసేన పార్టీ శక్తిని దేశానికి చాటుదామని గంగులయ్య పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై శ్రేణులకు దశా దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్లను జన శ్రేణులతో కలిసి ఆవిష్కరించిన డా.వంపూరు గంగులయ్య ఆవిర్భావ సభకు వచ్చే జనసేన నాయకుల వివరాలు వాహన సదుపాయాలపై మండల మరియు జిల్లా,నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జయప్రదం చేయాలని, క్రమశిక్షణతో పండుగల చెయ్యాలని యావత్ దేశానికి జనసేన పార్టీ ఆవిర్భావ సభ గర్వించేలా ఈ సభ ఉండాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, పాడేరు, ఐటీ ఇంచార్జ్ సాలేబు అశోక్, ఐటీ టీమ్ కో-ఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్, అరకు పార్లమెంట్ ఎక్సిక్యుటివ్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, జి మాడుగుల మండల అధ్యక్షులు మసాడి బీమన్న, గూడెం మండల అధ్యక్షులు కోయ్యం బాలరాజు, చింతపల్లి మండల అధ్యక్షులు వంతాల బుజ్జి బాబు, కొయ్యూరు మండల అధ్యక్షులు జి.లక్ష్మణ్, అరకు వ్యాలీ మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, డంబ్రిగూడ మండల అధ్యక్షులు సీదరి దనేశ్వర్ రావు, పెదబయలు మండల అధ్యక్షులు కిల్లో బాబూరావు, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్, పాడేరు మండల ఉపాధ్యక్షులు ఎస్ భూపాల్, కార్య నిర్వహణ సభ్యులు వంపూరు సురేష్, మండల సీనియర్ నాయకులు పాంగి శివాజీ, మదేల నాగేశ్వర్రావు, తల్లె త్రిమూర్తులు, అప్పలరాజు, గూడెం మండల ఐటీ ఇంచార్జ్ కొయ్యం ఇమ్మానుయేల్ (సిద్దు) మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు జనసైనికులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment