ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం: వబ్బిన సత్యనారాయణ

శృంగవరపు కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం జనసేన పార్టీ కార్యాలయము నందు గురువారం మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని వబ్బిన సత్యనారాయణ అన్నారు. అనంతరం శృంగవరపు కోట, కొత్తవలస మండలం నాయకులు, యువతతో కలిసి జనసేన నేత వబ్బిన సత్యనారాయణ, పిల్లా రామదుర్గ ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండలం నాయకులు పిల్లా రామదుర్గ, కొత్తవలస మండలం అధ్యక్షులు గాలి అప్పారావు, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండల ప్రధాన కార్యదర్శిలు రాందాస్ కాశీ, బంధం సత్యనారాయణ, కార్యదర్శి అంగి కోటీశ్వరావు, జిన్నాల శ్రీను, గొంపా అప్పలనాయుడు, నాగేష్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment