మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం..!

*సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు
*పాపిరెడ్డిపాలెంలో మొక్కల దత్తత

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పాపి రెడ్డిపాలెం హరిజనవాడలో జనసేన మహిళా మండల అధ్యక్షురాలు వంగిపూడి జయసుధ పది మొక్కలను దత్తత తీసుకుని ఉదాహరణగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ప్రోత్సహించారు. “మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే లక్ష్యంతో పెరుగుతున్న కాలుష్యానికి ఎదురుగానే కాదు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న సంకల్పంతో ప్రతి కుటుంబం నాలుగు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే సర్వేపల్లిలో జనసేన నేతలు పది పది మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, పలువురు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment