జగన్‌ నిరంకుశపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: గురాన అయ్యలు

విజయనగరం: జగన్‌ నిరంకుశపాలన నుంచి రాష్ట్రాన్ని కాపా డుకుందామని ప్రజలకు జనసేన గురాన అయ్యలు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు విజయనగరం నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో, గ్రామాల్లో చేపట్టిన నిరసన దీక్షలకు జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వైసీపీ ప్రతీకార చర్యకు నిదర్శనమన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించే ఏపీ సీఎం జగన్ పూర్తిగా అవినీతి బురదలో కూరుకుపోయి, మిగతా అందరిపైనా బురద జల్లుతున్నారని అన్నారు. జగన్‌ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అవినీతి మరక లేని పవన్‌కల్యాణ్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తరిమితరిమి కొడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజానీకానికి సొంత డబ్బు వెచ్చించి సేవ చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని స్పష్టం చేసారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ బిల్లు చట్టసభల్లోనూ ఆమోదం పొందితే ఖచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. విజయనగరం నియోజకవర్గం మహిళా ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. కార్పోరేషన్ లో బీసీ మేయర్ కి ఇస్తున్న విలువ ఏమిటో ప్రజలందరూ గమనించాలన్నారు. అలాగే వైద్య కళాశాల ప్రారంభోత్సవ శిలాపలకం పై స్థానిక టీడీపీ మహిళ కార్పొరేటర్‌ పేరు లేకపోవడం శోచనీయమన్నారు. విజయనగరం పట్టణంలో రోడ్డు విస్తరణ కు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినా.. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. పైడిమాంబ జాతరకి రోడ్డు మరమ్మతులకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి నిధులు కేటాయించి. తూతూమంత్రంగా పనులు చేపట్టి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా పాలకుల మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డి.రామచంద్రరాజు, కాటం అశ్వని, మాతా గాయిత్రి, లక్ష్మీ, జ్యోతి, చక్రవర్తి, ఎల్.రవితేజ, పిడుగు సతీష్, రవీంద్ర, నారాయణరాజు, అడబాల వేంకటేష్, ఎమ్ .పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, అభిలాష్, సయిద్ బొకారి, సాయి, దుర్గారావు, సురేష్ కుమార్, హిమంత్ కుమార్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.