గుంటూరు, స్త్రీ లేనిదే సృష్టి లేదని, ప్రతీ ఆడబిడ్డలో అమ్మను చూసుకుందామని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా బ్రస్ట్ క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ ఆరే ప్రియాంకను జనసేన నేతలు ఘనంగా సన్మానించారు. మహిళలకు అత్యంత ప్రాణాపాయంగా మారిన బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఎంతోమందిని క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడిన డాక్టర్ ఆరె ప్రియాంకను సన్మానించటం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ మహిళా ధైర్యానికి ప్రతీక అయిన ఝాన్సీ లక్ష్మి భాయ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కొన్ని రంగాల్లో పురుషుల కన్నా మహిళలే బాగా రాణిస్తున్నారని అందుకు ప్రత్యక్ష నిదర్శనం అంతరిక్షంలోనే ఇప్పటికీ ఉన్న సునీతా విలియమ్స్ అంటూ కొనియాడారు. అత్యాచారాలు, లింగ వివక్ష, అసమానతలు లేని సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆళ్ళ హరి కోరారు. ఈ కార్యక్రమంలో రోహిణి, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నేతలు మెహబూబ్ బాషా, కోలా అంజి, నరసింహ రెల్లి, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment