అమరావతి రైతులకు మద్దతు పలుకుదాం… అంజూరు చక్రధర్

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా వారికి జనసేన పార్టీ తరపున మద్దతు తెలపాలని చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర మంగళవారం ఉదయం 10గంటలకు శ్రీకాళహస్తి మండలం ఆంజనేయపురం గ్రామానికి చేరుకుంటుంది. చిత్తూరు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని మద్దతు తెలపాలని కోరుచున్నానని తెలిపారు.