వైసీపీ ప్రభుత్వాన్ని తిప్పి కొడదాం: సిరిపోతు ప్రసాద్

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సిరిపోతు ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి పెద్ద మోసం చేశారు. ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఆయన చేయలేదు ఆయన వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక సంవత్సరంలో మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కానీ ఇంతవరకు నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. నిరుద్యోగులు అందరూ ఒకటే అడుగుతున్నారు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ప్రజలని పాలించే నాయకుడు కాదు మాకు కావాల్సింది ప్రజలే పాలించే నాయకుడు కావాలి అని నిరుద్యోగులు అందరూ చెప్తున్నారు. ఈసారి ఏదేమైనా 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురుతుందని పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని నిరుద్యోగులు గట్టిగా చెప్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మా వీరఘట్టం ని పట్టించుకోవట్లేదు మాకు ఒక బస్ స్టాప్ కావాలని ఎంతోమంది నాయకులకి అడిగాము కానీ ఎవరూ పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో జరిగిన జనసేనపార్టీ నియోజకవర్గం సమావేశానికి హాజరైన పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకుని వెళ్ళాము ఆయన హామీ ఇచ్చారు 2024 లో వచ్చేది మన జనసేన ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వాన్ని తిప్పి కొడదాం అని చెప్పారు. ఈ ప్రభుత్వం దోచుకుంటున్న డబ్బుని ప్రజలకు వివరించేలా మండల జన సైనికులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే భయం పవన్ కళ్యాణ్ మాట్లాడితే భయం పవన్ కళ్యాణ్ వెహికల్ కొంటే భయం పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వచ్చి తిరిగితే భయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఒకే ఒక్క వ్యక్తికి భయపడుతున్నారా అంటే ఆ వ్యక్తి వీళ్ళ కన్నా బలమైన వ్యక్తి అయి ఉండాలి లేదంటే వీళ్ళ కన్నా ఎక్కువగా పని చేయగల సత్తా ఉన్నవాడైనా అయి ఉండాలి రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో చూసినా ఏ జిల్లాలో చూసిన ఏ మండలంలో చూసిన వైయస్సార్సీపి ప్రభుత్వం చేసేదేం లేదు పొడిచేది ఏం లేదు వస్తుంది డబ్బులు లాక్కుంటుంది రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంది అప్పులు చేస్తుంది అని అంటున్నారు తప్ప అభివృద్ధి చేస్తున్నారు అని రాష్ట్రంలో ప్రజలందరూ చెబుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి పరిపాలన చేయండి అంతేగాని ప్రజల సొమ్మును తిని మళ్లీ ఆ ప్రజలను మీరు పట్టించుకోవడం లేదు ఎలక్షన్ టైం లో వస్తున్నారు ఓట్లడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఎక్కడ నాయకులు అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా మనం మారుదాం మన ప్రభుత్వాన్ని మారుద్దాం మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుందాం అంటున్న రాష్ట్ర ప్రజలు.