గాఢ నిద్రలో ఉన్న సీఎంను మేల్కొలుపుతాం రాష్ట్ర రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది

నెల్లూరు, జనసేన పార్టీ #GoodMorningCMSir హష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తారీకులో జరగనున్న డిజిటల్ క్యాంపెయిన్ గురించి జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడ్మ జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ…

  • రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని బడ్జెట్లో అదనంగా 43% కేటాయింపు కోరి రోడ్లను పరుస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ ప్రభుత్వం వాటిని బాగుపరిచింది లేదు.
  • రాష్ట్రంలో అన్ని రకాల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది గత సంవత్సరంలో సెప్టెంబర్ రెండో తారీకు నుంచి రెండు మూడు రోజులు నిర్వహించిన డిజిటల్ కార్యక్రమం దేశంలో నెంబర్ వన్ గా నమోదయింది.
  • ఆ తర్వాత మొక్కుబడిగా అక్కడక్కడ రోడ్లను మట్టి, రబ్బిష్ తో పూడ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
  • రాష్ట్రంలో సెస్ రూపంలో 715 కోట్లు, దాన్ని అడ్డం పెట్టుకుని ఆరు వేల కోట్లు అదనంగా రుణం పొంది సామాన్యుల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.
  • గతంలో నిర్మించిన రోడ్లు తాలూకు బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా రోడ్లు వేయడానికి ముందుకు రావడంలేదు.
  • రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఎనిమిది వేల కిలోమీటర్లు రోడ్డు వేస్తామని 2వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ నెల 10 లోపు అని రోడ్స్ మరమ్మత్తు చేస్తాము అని ఛాలెంజ్ చేసిన సీఎం కి వాస్తవాలు కళ్లముందు కనపడే గుంతల ఫొటోస్ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పోస్ట్ చేస్తాము .
  • దారుణంగా ఉన్న రోడ్ల వల్ల సామాన్య ప్రజలు ప్రమాదాలకు గురై ఆనారోగ్య పాలవుతున్నారు.
  • మంజూరైన ప్రజాధనంతో రాష్ట్ర రోడ్లన్నీ మెరుగుపరిచి ఈ నెల 15 తారీకు లోపల ఫోటోలు పెడతాం అన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మిన్నకుంది.
  • ప్రజా సమస్యల్ని తుంగలోకి తొక్కి నిద్రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపుతూ ఈ నెల 15, 16, 17 తారీకు లో రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు #GoodMorningCMSir
    అనే క్యాప్టన్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రభుత్వానికి అసమ్మతి తెలియజేస్తాము.
  • జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నాయకులు మరియు జిల్లా కమిటీ సభ్యులతో తమ తమ గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాల్లో రహదారులపై గుంతలు కనిపించే విధంగా ఫోటోలతో డిజిటల్ క్యాంపెయిన్ సమర్థవంతంగా నిర్వహించి గతంలో మాదిరిగానే జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు.
  • రోడ్లు ఇప్పటికీ అధ్వాన పరిస్థితులో ఉన్నాయి.
    ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి సుధీర్ ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్ జిల్లా కార్యదర్శి రాజేష్, ఎస్వీ సుబ్బయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య మరియు ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.