గాఢ నిద్రలో ఉన్న సీఎంను మేలుకొలుపుదాం

సింగనమల, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ ఆదేశాల మేరకు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం ఇరువెందుల గ్రామానికి వెళ్లే రహదారి రెండు సంవత్సరాల నుండి కంకర వేసి అలాగే వదిలేశారు కావున ఈ రోడ్డు వెంటనే స్థానిక ఎమ్మెల్యే గుత్తేదారుతో తొందరగా పని పూర్తి చేయించవలసినదిగా తెలియజేస్తున్నామని లేనిపక్షంలో సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి సింగనమల మండల కన్వీనర్ తోట ఓబులేసు బందెల సాయి శంకర్, రాము, మోహన్, రామంజి, ప్రవీణ్, బాలమునయ్య తదితరులు పాల్గొన్నారు.