గాఢ నిద్రలో ఉన్న సీఎంను మేలుకొలుపుదాం: కంబాల బాబులు

పెనుగొండ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా #Good morning cm sir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులు ఆధ్వర్యంలో కొఠాలపర్రు గ్రామంలో.. కొఠాలపర్రు, శేషమ్మ మీదుగా మంగళ పాలెం, మార్టేరు, ఆచంట వెళ్లే రోడ్డు గత పది సంవత్సరాల నుండి ఈ రోడ్డు వెయ్యటముగాని రిపేరు చేయటం గాని జరగలేదు.. వెంటనే సీఎం సార్ మీరు చెప్పిన జులై 15 2022 వచ్చేసింది. కానీ మా రోడ్లు ఇంతవరకు వెయ్యలేదు కనీసం రిపేరు కూడా చేయలేదు ఇక నిద్రలేసి తొందరగా రోడ్లు వెయ్యాలని కోరి ప్రార్థిస్తున్నాం లేనిపక్షంలో.. పెనుగొండ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఆకుల సుబ్బారావు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, రామన్నపాలెం ఎంపీటీసీ మొఖమాట్ల కృష్ణ కాంత్, మునమరు గ్రామ పార్టీ అధ్యక్షులు అడ్డగల రాజశేఖర్, రామన్నపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు గంట్రోత్ సురేష్, మండల కమిటీ సభ్యులు ఏడిది కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దార్లంక మారుతి, నూకల సాయి, ముద్దాల రామకృష్ణ, పోసంశెట్టి రమేష్, కంబాల బాలస్వామి, ఇంకా కొఠాలపర్రు గ్రామ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.