ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కలసికట్టుగా కృషిచేద్దాం: పాలవలస యశస్వి

విజయనగరం, ప్రజల్లో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేందుకు, వారి మధ్య ఉన్న దూరాలను తొలగించేందుకు పండుగలు దోహదపడతాయని జనసేన పార్టీ విశ్వసిస్తుంది. పండుగలు దేశ పౌరులుగా, సమాజంగా కలిసి ఉండటం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ స్ఫూర్తితో మీరందరూ మన దేశం యొక్క గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని, బలాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే విధానాలను అర్దం చేసుకోవాలని జనసేన ప్రోత్సహిస్తున్నది. ఈ పండుగ సమయంలో మీకు, మీ కుటుంబానికి ఆ గణపతి, గణనాధుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసి రానున్న రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కలసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిస్తున్నానని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి అన్నారు.