ఎల్‌ఐసీ వారి మంచి బెనిఫిట్స్ ఉన్న స్కీమ్ ‘ఆధార్ స్తంభ్’

ఎల్ఐసీ సంస్థ వివిధ రకాల పాలసీ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తోంది. మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ, లైఫ్ టర్మ్, చిల్డ్రన్స్ ప్లాన్స్ ఇలా ఎన్నో రకాల ప్లాన్లను అందిస్తోంది. వీటిలో ముఖ్యంగా ఎల్‌ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీ కూడా ఒకటి. ఆధార్ కార్డు కలిగిన వారు ఈ పాలసీతో మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.4 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీ వల్ల మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తోపాటు డెత్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. తక్కువ ప్రీమియం కలిగిన పాలసీ ఆధార్ స్తంభ్ పాలసీ.

సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ.. ఆధార్ స్తంభ్ పాలసీతో రక్షణతోపాటు పొదుపు చేయొచ్చని తెలిపారు. ఎల్‌ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీ కేవలం మగ వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ పాలసీ తీసుకోవాలని భావిస్తే.. కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఇది నాన్ లింక్డ్ పాలసీ. అంటే మార్కెట్ రిస్క్‌తో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. పాలసీ తీసుకున్న వారు పాలసీ కాలం ముగియక ముందే చనిపోతే నామినీకి పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ డబ్బుతో కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఒకవేళ పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా పాలసీదారుడు జీవించి ఉంటే అప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందొచ్చు. 8 నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.75,000 బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.10,314గా ఉంటుంది. రూ.3 లక్షల బీమా మొత్తానికి ఇది వర్తిస్తుంది. పాలసీ టర్మ్ 20 ఏళ్లు. లాయల్టీ అడిషన్ కింద మెచ్యూరిటీ సమయంలో మరో రూ.97,500 లభిస్తాయి. అంటే నెలకు రూ.859తో రూ.4 లక్షల వరకు పొందొచ్చు.