ఎత్తిపోతల పథకాలతో పంటపొలాలకు జీవం

*దిగువ పంటపొలాలకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బత్తుల

రాజనగరం నియోజకవర్గంలోని అన్నదాతల కళ్లల్లో ఆనందం చిరకాలం నిలవాలని సంకల్పించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కాటవరం మరియు తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా దిగువ పంటపొలాలకు సాగునీటిని బుధవారం విడుదల చేశారు. సీతానగరం మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ ఇంచార్జి నీరుకొండ వీరన్న చౌదరి, జనసేన రాష్ట్ర కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులు, నిధుల విడుదల, పెండింగ్ బిల్లులపై సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బత్తుల, రైతులకు వ్యవసాయాన్ని పండగగా మార్చే దిశగా చొరవ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు అందించిన సాగునీరును సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, జనసేన జిల్లా కార్యదర్శులు కిమిడి శ్రీరామ్, మేడిశెట్టి శివరామ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment