జనసేన నాయకుడు అతికారి కృష్ణ సహకారంతో అంగన్వాడి స్కూల్లో వెలుగులు

రాజంపేట నియోజకవర్గం: సిద్ధవటం గ్రామం అంగన్వాడి స్కూల్లో గత 15 సంవత్సరాలుగా విద్యుత్ సౌకర్యం లేక కనీసం లైట్ కూడా లేకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమస్యను గూర్చి పాఠశాల నూతన టీచర్ అతికారి కృష్ణ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి అంగన్వాడి స్కూల్ కి అతికారి కృష్ణ 30000 రూపాయల ఆర్థిక సహకారం చేసి విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు కొట్టే, రాజేష్ అధికార ప్రతినిధులు బీగాల సుబ్రహ్మణ్యం, పసుపులేటి కళ్యాణ్, జనసేన నాయకులు ఆవుల విశ్వనాథ్, పోలిశెట్టి మధు, మోడం నవీన్, పసుపులేటి సాయి, పవన్, తేజ, దుర్గాప్రసాద్, అల్లం సాయి, ఆవుల హరీష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.